YSR HQ Wall Papers

These are High Quality Click On the Image ENLARGE














People About YSR



మహిళల సాధికారికతకు, పిల్లల సంక్షేమానికి పేదలు, రైతుల అభ్యున్నతికి జీవితమంతా ధారపోసిన దార్శనికుడు, ప్రభావశీలి, అభ్యుదయ నాయకుడుఆయన. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించారు.వైఎస్‌ మరణం కాంగ్రెస్‌కు తీరని నష్టం.ఆయన సేవలను సదా స్మరించుకుంటాం.
సమాజంలోని అన్ని వర్గాల కోసం రాత్రింబవళ్లు అలుపు లేకుండా ఆయన శ్రమించిన తీరు మాకు స్ఫూర్తిదాయకం. వైఎస్‌ సేవలను ఎప్పటికీస్మరించుకుంటాం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, మద్దతుదార్లకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. 
                                                                                                                                                           సోనియా గాంధీ 
 
 
 
 
 
డాక్టర్ వై.ఎస్ రాజశేకర్ రెడ్డి ఆకస్మిక మరణంతో దేశం ఒక గొప్ప నాయకుణిని కోల్పాయింది. పేదల సంక్షేమం కోసం  తపన పడే ఒక ఆదర్శ ముక్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ కోల్పాయింది. ఆయన కుటుంభ సభ్యులకు, సన్నిహితులకు, ఆంధ్రప్రదేశ్  ప్రజలకు న హృదయ పూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను.
                                         మన్మోహన్ సింగ్






వైఎస్సార్‌ నిజమైన నాయకుడు. ఆయన మృతి ఆంధ్రప్రదేశ్‌కు
భారత్‌కు తీరని నష్టం. నేను వ్యక్తిగతంగా ఆయన దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నా.
పేదల బతుకులు బాగుపర్చాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకం.
 
ఈ రోజు మనందరికీ దుర్దినం. వై.ఎస్‌. కుటుంబ సభ్యులకు,
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నా సంతాపం తెలియజేస్తున్నాను.

                                       -----  
రాహుల్‌గాంధీ
 
 




                 కోట్లాది ప్రజల అభిమాన నాయకుడు, దీనబాంధవుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్తను తను జీర్ణించుకోలేకపోతున్నానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
వేలేఖరులతో మాట్లాడుతూ,  రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలన్న తపన ముఖ్యమంత్రిలో ఉండేదని, ముఖ్యంగా అన్నదాతల సంక్షేమం కోసం చేపట్టిన జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న కోరిక వైఎస్ లో కనిపించేదన్నారు. ఈ కోరిక తీరకుండానే అయన అర్ధంతరంగా ప్రమదవశాత్తూ కన్నుమూయడం బాధాకరమని చిరంజీవి అన్నారు. వైఎస్ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరనీయుడిగా నిలిచిపోతారని చిరంజీవి వ్యాఖ్యానించారు. వైఎస్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు అయన కీర్తిని నిలబెడతాయనీ, అయన ప్రజల గుండెల్లో సజీవంగా ఎప్పుడూ ఉంటారని చిరంజీవి అన్నారు. వైఎస్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమనీ, అటువంటి ప్రజానాయకుడు  ఇంత అకస్మాత్తుగా మరణించడం దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. వైఎస్ కుటుంబ  సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రజారాజ్యం పార్టీ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన మిగిలిన వారి కుటుంబ సభ్యులకు చిరంజీవి సానుభూతి తెలిపారు.      
                             

                                                                                              - చిరంజీవి

  నా జీవితంలో ఇంతటి విషాదం చూడలేదు. వైఎస్ మృతిని జీర్ణించుకోలేక పోతున్నాను. అయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.                                            
                                    - ఎన్ డి  తివారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్.










  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక డైనమిక్ లీడర్ ను కోల్పోయారు. వైఎస్ క్షేమంగా తిరికి వస్తారని ఆశించాం. దేవుడు నిర్దయగా చూశాడు.
                                    ఎం.వెంకయ్యనాయుడు, బీజేపీ నేత.












                                                                                                                     ఎన్టీఆర్  మాదిరిగా ప్రజాభిమాన చూరగొని, జనహృదయ నేత  గా గుర్తింపు పొందింది వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే.  వైఎస్ మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. రాజశేఖర రెడ్డిని కోల్పోవడం రాష్ట్రానికే కాకుండా దేశానికీ తీరని లోటు. ప్రజలకు సేవ చేయడంలో వైఎస్ ఎన్నుకున్న మార్గాలు అందరికీ అనుసరనీయాలు. కేంద్రమంత్రిగా ఇవాళ నేను ఇంతటి గౌరవం పొండుతున్ననంటే అది వైఎస్ ఇచ్చిన చేయూతే. మహోన్నతమైన  వైఎస్ లేరంటే జీర్ణించుకోలేక పోతున్నాను.

                                                                                       - పురంధరేశ్వరి 


    








   ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతిశీల నాయకుణ్ణి కోల్పోయింది. అంకిత భావంగల రాజకీయవేత్త. వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదాన్ని తట్టుకోగలశక్తిని ఆయన కుటుంబానికి అందించాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నా.

        - అటల్ బిహారీ వాజ్ పేయి. మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత.

 







   ప్రజానేత వైఎస్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. పాతికేళ్ల రాజకీయ జీవితం మొత్తాన్నీ ప్రజల కోసమే అంకితం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ చేసిన 1400 కి.మీ.పాదయాత్ర  అసామాన్యం.
                             

        -   ఎల్.కే.అద్వాన, లోక్ సభలో ప్రతిపక్ష నేత.
 
 









    దేశం మంచి నాయకుడిని కోల్పోయింది. రాజశేఖర రెడ్డి రైతుబిడ్డ, ఆయన మృతి దేశానికే పెద్ద లోటు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో పేదలకు తీర్చలేని లోటు. రాజశేఖర రెడ్డి మృతితో రాష్ట్రం, ప్రజలు డైనమిక్ నేతను పోగొట్టుకున్నారు.
                                                                                                                                                                                                                                                                                                - రాజ్ నాద్ సింగ్, భాజపా జాతీయ అధ్యుక్షులు.
  
  






   వైఎస్ డైనమిక్ ముఖ్యమంత్రి. ప్రజల మనిషి. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. దీనిని జీర్ణం చేసుకోలేకపోతున్నాం.
                                                                                                                        - జయంతి నటరాజన్, కాంగ్రెస్ నేత.







   వైఎస్ మరణం చాలా విషాదకరం. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
                                                                

- సీతారం ఏచూరి, సీపీఎంనేత.








    వైయస్సార్  మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికే తీరని లోటు.
             

                                          - ఏబీ బర్దన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి.












                 సామాన్య ప్రజల్లో అపారమైన ఆదరణ కల రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర రెడ్డి  అర్ధంతరంగా మృతి చెందడం రాష్ట్రానికి పెద్దలోటు అని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే  డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. మొక్కవోని ధైర్యం, అచంచల మానసిక స్థైర్యం, చెరగని చిరునవ్వుతో వ్యక్తిగత ఆకర్షణ గల అరుదైన నేత. ఆయనతో ఎవరైనా ఏకీభవించవచ్చు, లేదా విభేదించవచ్చు. కానీ ఆయన ఉక్కుసంకల్పాన్ని, పేదల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఆయన ఆర్తిని, శక్తిమంతమైన నాయకత్వ పటిమను మాత్రం ఎవరైనా ప్రశంశించక తప్పదు. వైఎస్ మరణం ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ కు మాత్రమే లోటు కాదని, యావత్ రాష్ట్రానికి ఇది తీరని నష్టం.

                                                                                                 
                                                                - జెపి





      ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం పట్ల  నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. రాష్ట్రంలో గొప్ప ప్రజాదరణ గల వైఎస్ అకాలమరణం వల్ల రాష్ట్ర ప్రజలే కాక దేశమే ఒక మహా నాయకుణ్ణి కోల్పోయింది. ఆయన మృతి పట్ల నేను తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వైఎస్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

                       - కె. చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితిఅధ్యక్షుడు. 


                






        ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం విషాదకరం. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల మన్ననలను పొందిన మహానేత మరణం రాష్ట్రంలో చీకటి రోజు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక శైలి తీసుకువచ్చిన ఘనత చెందుతుంది. రాజకీయపరంగా ఎటువంటి వైరుధ్యాలున్న వ్యక్తిగతంగా మాత్రం వైఎస్ మంచి మరియు పాలనాదక్షుడు. వైఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  

                                                                                        నారాయణ








    సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఆయన ప్రజలతో మమేకం కావడానికి వెళుతూ మార్గమధ్యంలో మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.


                    - బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.









   రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. 
                                                                                                              

                                                - బండార దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

First Post To YSR

Hi Friends, This my first post to You.....

In this Post I am putting Some Wall Papers of Our Great Man YSR.